కాంగ్రెస్‌కు అద్భుతమైన ఫలితాలు: సీఎం
HYD: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు అఖండ విజయం సాధించడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 7,527 స్థానాల్లో విజయం సాధించగా, మరో 808 చోట్ల కాంగ్రెస్ రెబల్స్ గెలుపొందారని తెలిపారు. మరోవైపు BRS 3,511, BJP 710 చోట్ల గెలిచినట్లు పేర్కొన్నారు. ఈ విజయం ప్రభుత్వ ప్రజాపాలనకు నిదర్శనమన్నారు.