జామాకులతో పలు సమస్యలకు చెక్
జామాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం, గ్యాస్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చర్మ సమస్యలను దూరం చేస్తాయి. బరువును అదుపులో ఉంచుతాయి. జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గిస్తాయి.