VIDEO: పట్టుబడిన బియ్యం రైస్ మిల్లుకు తరలింపు
MDK: తూప్రాన్ పట్టణ పరిధిలో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన రేషన్ బియ్యాన్ని రామాయంపేట మండలం డీ. ధర్మారం శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్‌కు తరలించినట్లు పౌరసరఫరాల శాఖ ఇన్‌స్పెక్టర్ నర్సింలు ఇవాళ తెలిపారు. పట్టుబడిన రేషన్ బియ్యం 293.90 క్వింటాళ్లు ఉన్నట్లు వివరించారు. అయితే, తూప్రాన్ వద్ద నిలువ చేసేందుకు సరైన స్థలం లేకపోవడంతో రామాయంపేటకు తరలించినట్లు వెల్లడించారు.