నందిమేడారంలో మహిళా హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం
PDPL: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళల ఆరోగ్య సంరక్షణకు హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం ధర్మారం మండలం నందిమేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభమైంది. గ్రామ సర్పంచ్ వీర్ పాల్, ఉప సర్పంచ్ రవి ఈ కార్యక్రమాని ప్రారంభించారు. శిబిరంలో స్వశక్తి సంఘాలకు చెందిన 35 మంది మహిళలకు పరీక్షలు నిర్వహించారు. అందుకు సంబంధించిన రక్త నమూనాలు తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్‌కు పంపించారు.