మూసీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉద్ధృతి
SRPT: మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టులోనికి 4,327 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా అధికారులు సోమవారం రాత్రి రెండు గేట్లను ఎత్తి 4,983 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. గరిష్ట నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 643 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నట్లు అధికారులు తెలిపారు.