ఇచ్చాపురం సీఐ చిన్నం నాయుడుకు పురస్కారం

SKLM: ఇచ్చాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న చిన్నం నాయుడుకు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పురస్కారాన్ని అందజేశారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఈ పురస్కారాన్ని తనకు అందజేశారని సీఐ తెలిపారు. గంజాయి కేసుల పరిష్కారానికి కృషి చేసినందుకు తనకి పురస్కారం అందుకున్నారు.