VIDEO VIRAL: బెంజ్ కారు బీభత్సం
TG: హైదరాబాద్ నానక్‌రామ్‌గూడ వద్ద అతివేగంగా వచ్చిన ఓ బెంజ్ కారు మరో వాహనాన్ని ఢీకొట్టి పరారైంది. అప్రమత్తమైన పోలీసులు ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద కారును ఆపేందుకు ప్రయత్నించగా.. డ్రైవర్ ఓ కానిస్టేబుల్‌ను దాదాపు కిలోమీటరు మేర ఈడ్చుకెళ్లాడు. స్పందించిన వాహనదారులు, పోలీసులు కలిసి కారును అడ్డుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు నిర్ధారణ అయింది.