ఈ నెల 4న జిల్లాలో మహేష్ కుమార్ గౌడ్ పర్యటన
ADB: ఈ నెల 4న టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మకంటి మహేష్ కుమార్ గౌడ్ జిల్లాలో పర్యటించనున్నట్లు ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో సమావేశమై మాట్లాడారు. CM పర్యటన నేపథ్యంలో నిర్వహించనున్న పొలిటికల్ కార్యక్రమంలో మహేష్ కుమార్ గౌడ్ పాల్గొంటారని వెల్లడించారు.