బీహార్‌లో పోలింగ్.. పలుచోట్ల ఉద్రిక్తత
బీహార్‌లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కొనసాగుతోంది. కొన్నిచోట్ల ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుండగా.. మరికొన్నిచోట్ల తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రోహతాస్ జిల్లా కర్గహార్, బిషన్పురా గ్రామాల్లో ఓటింగ్‌ను బహిష్కరించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఓటర్లను బతిమాలుతున్నారు. అలాగే, నవాడా జిల్లాలోని వారిసలిగంజ్ పోలింగ్ బూత్ వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి.