చీమకుర్తిలో ఘనంగా ఇరుముడి కార్యక్రమం

చీమకుర్తిలో ఘనంగా ఇరుముడి కార్యక్రమం

ప్రకాశం: చీమకుర్తి మండలంలో అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం ఘనంగా జరిగింది. అయ్యప్ప స్వామి మాలలు ధరించిన స్వాముల బంధువులు కుటుంబ సభ్యులతో హాజరై దేవాలయాలలో పూజలు చేశారు. అనంతరం ఇరుముడి ధరించి స్వాములు అయ్యప్ప స్వామిని దర్శించుకొనేందుకు శబరిమలకు సిద్ధమైనట్లు తెలిపారు.