జమ్మలమడుగులో ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్

జమ్మలమడుగులో ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్

కడప జిల్లా జమ్మలమడుగులో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు డీ.ఎస్.పీ కే. వెంకటేశ్వరరావు ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘనలకు కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ సీ.ఐ నరేష్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.