భాస్కర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరికలు
KMR: బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ కార్యకర్తలు శుక్రవారం కాంగ్రెస్లో చేరారు. డీసీసీబీ మాజీ ఛైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పోచారం భాస్కర్ రెడ్డి సమక్షంలో బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో ఈ చేరికలు జరిగాయి. సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్లో చేరుతున్నారని చెప్పారు.