రైతు మృతి.. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా డిమాండ్
ASR: డుంబ్రిగూడ మండలం పిత్తగూడ గ్రామానికి చెందిన కీల్లో బలరాం (47) విద్యుత్ ఘాతుకానికి గురై మృతి చెందిన ఘటనపై ఆయన కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి.సూర్యనారాయణ ఇవాళ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. బలరాం మరణంతో వారి కుటుంబం ఆర్థికంగా దిక్కుతోచని స్థితిలో ఉందని తెలిపారు.