'ఏసు మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలి'
SKLM: ఏసుక్రీస్తు బోధనలు అందరికీ అనుసరణీయమని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఆమదాలవలసలో నిర్వహించిన ఐక్య క్రిస్మస్ వేడుకల్లో సోమవారం ఆయన పాల్గొని మాట్లాడారు. అన్ని మతాల సారాంశం ఒకటేనన్నారు. ఇతరులకు సహాయం చేయడంలో ప్రతి ఒక్కరూ ముందుండాలని సూచించారు. ఏసు మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలి అని అన్నారు