నేడు కొత్తపేట ఎమ్మెల్యే బండారు పర్యటన వివరాలు
కోనసీమ: నేడు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శనివారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9:30 గంటలకు డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా కొత్తపేట బస్టాండ్ సెంటర్‌లో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులార్పిస్తారు. కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.