ఎంపీడీవో కార్యాలయం ఎదుట వికలాంగుల నిరసన

సత్యసాయి: పెనుకొండలో ఎంపీడీవో కార్యాలయం ముందు సీపీఎం ఆధ్వర్యంలో వికలాంగుల పెన్షన్ దారులు బుధవారం నిరసన తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ హరి, సీఐటీయూ మండల కన్వీనర్ బాబావలి మాట్లాడుతూ.. పెనుకొండ మండలంలో 193 వికలాంగుల పెన్షన్ తొలగించారని వారికి వెంటనే పెన్షన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీవో నరేష్‌కు వినతి పత్రం అందజేశారు.