గ్రూప్-1 అక్రమాల కేసు.. మరొకరు అరెస్ట్

గ్రూప్-1 అక్రమాల కేసు.. మరొకరు అరెస్ట్

AP: గ్రూప్-1 పరీక్షలో జరిగిన అక్రమాల కేసులో పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. మెయిన్స్‌ జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడ్డారని 'క్యామ్ సైన్' మీడియా సంస్థ డైరెక్టర్ ధాత్రి మధును అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. ఈ కేసులో మధు ఏ2గా ఉన్నారు. ఆయన అవకతవకలకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసులో సీనియర్ IPS పీఎస్ఆర్ ఆంజనేయులు ఏ1గా ఉన్నారు.