హోటళ్లపై సివిల్ సప్లై అధికారులు దాడులు

హోటళ్లపై సివిల్ సప్లై అధికారులు దాడులు

కృష్ణా: మచిలీపట్నంలో సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఇవాళ ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం అక్రమంగా వాడుతున్న డొమస్టిక్ గ్యాస్ సిలండర్లను స్వాధీనం చేసుకుని, నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.