VIDEO: ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడి
JGL: ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో చైత్రమాసం శనివారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా గోదావరి నదిలో స్నానమాచరించి అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా, క్యూలైన్లలో గంటల పాటు వేచి దర్శనం పొందారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు.