నేటి నుంచి రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు

నేటి నుంచి రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు

TG: ఇవాళ్టి నుంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (CPI) నిర్వహిస్తోంది. ఈ పోరాటంలో భూస్వాములకు, నిజాం రాజుకు వ్యతిరేకంగా రైతులు చేసిన త్యాగాలను స్మరించుకోవడానికి ఈ వేడుకలను ఈనెల 17 వరకు జరుపనున్నారు. ఈ పోరాటం భారతదేశ చరిత్రలో ఓ ముఖ్యమైన ఘట్టం. ఈ పోరాట ఫలితంగానే హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనమైంది.