శ్యాం కుమార్ రెడ్డి అంత్యక్రియల్లో ఎమ్మెల్యే కడియం

JN: చిలుపూరు మండలం రాజవరంలో మృతి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు శ్యామ్ కుమార్ రెడ్డి అంత్యక్రియలలో నేడు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయిల్ ఫెడ్ రాష్ట్ర ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి భాగస్వామ్యం పంచుకున్నారు. శ్యామ్ కుమార్ రెడ్డి పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఇరువురు నాయకులు పాడేమోసి కన్నీటి వీడ్కోలు పలికారు.