ఈనెల 21నుంచి వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు
NZB: డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి)లో శ్రీ భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయ 14వ వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఈ నెల 21న గణపతి అభిషేకం, గోపూజ, శివపార్వతుల కళ్యాణం నిర్వహించనున్నారు. 22న వీరబ్రహ్మేంద్ర స్వామి అభిషేకం, అన్నప్రసాద వితరణ ఉంటుంది. 23న సత్యనారాయణ స్వామి అభిషేకం, వేంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించనున్నారు.