వాలీబాల్ విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు పంపిణీ

చిత్తూరు: వాలీబాల్ క్రీడలలో విజేతలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు పంపిణీ చేశారు. గూడూరు అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ క్రీడా ప్రాంగనంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టులో వాలీబాల్ టోర్నమెంట్ రెండు రోజులుగా జరిగింది. ఈ టోర్నమెంట్లో ఆరు జట్లు పాల్గొన్నాయి. విజేతలకు ఎమ్మెల్యే చేతులమీదుగా బహుమతులు ప్రదానం చేశారు.