'ఎంపీ తేజస్వీ సూర్య క్షమాపణలు చెప్పాలి'

'ఎంపీ తేజస్వీ సూర్య క్షమాపణలు చెప్పాలి'

RR: తెలంగాణ విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. సుదీర్ఘ పోరాటానికి సోనియా గాంధీ మద్దతు తెలపడం వల్లే విభజన సాధ్యమైందని ఆయన అన్నారు. అవగాహన లేకుండా మాట్లాడిన సూర్యపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.