భారీగా యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయం
BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు ఆదివారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా పెరిగింది. అందులో ప్రసాద విక్రయాలతో రూ.18,34,490, కార్ పార్కింగ్ రూ.6,44,500, VIP దర్శనాలతో రూ.7,50,000, బ్రేక్ దర్శనాలతో రూ.3,91,500, ప్రధాన బుకింగ్ రూ.3,09,150, వ్రతాలతో రూ.3,21,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.52,06,106, ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో తెలిపారు.