పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బకు వృద్ధుడు మృతి

పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బకు వృద్ధుడు మృతి

పల్నాడు: సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామానికి చెందిన సుబ్బారావు(62) పింఛన్‌ కోసం వెళ్లి వడదెబ్బకు గురై మృతి చెందాడు. సుబ్బారావుకు వచ్చే పింఛన్‌ బ్యాంకులో జమ చేశారని చెప్పడంతో తీసుకునేందుకు మండుటెండలో రెండు రోజుల నుండి బ్యాంక్ వద్దకు వెళ్లి వస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ఎండ తీవ్రతకు తట్టుకోలేక అతను మృతి చెందాడని గ్రామస్తులు వాపోయారు.