చలాన్ విధించాడని.. కానిస్టేబుల్‌పై దాడి
TG: HYDలో ఓ యువకుడు ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్తపేట వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్ అప్పారావు.. బైక్‌పై వెళ్తున్న భరత్ అనే యువకుడిని ఆపి చలానా విధించాడు. దీంతో భరత్ 15 నిమిషాల తర్వాత వచ్చి అప్పారావుపై రాయితో దాడి చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.