ALERT: అలా చేయకుంటే ఇకపై గ్యాస్ రాదు
కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై పెట్రోలియం కంపెనీలు నియంత్రణా చర్యలు చేపట్టాయి. హోటళ్లకు సిలిండర్ల సరఫరా నిలిపివేయాలని డీలర్లకు ఆదేశాలు జారీ చేశాయి. ఆసుపత్రులు, హాస్టళ్లకు మాత్రమే కమర్షియల్ సిలిండర్లు సరఫరా చేయాలని ఆదేశించాయి. అలాగే, గ్యాస్ వినియోగదారులు తప్పకుండా e-KYC చేసుకోవాలని సూచించాయి. e-KYC చేసుకోని గృహవినియోగదారులకు గ్యాస్ బుకింగ్ నిలిపివేయనున్నట్లు తెలిపాయి.