అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్ తీవ్ర ఆరోపణలు
అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ దేశాలు తమ షాహెద్ డ్రోన్ల వంటి వాటిని రూపొందించి పలు దేశాలపై దాడులు చేస్తున్నాయని.. ఆ నిందను తమపై వేస్తున్నాయని మండిపడింది. తమ దేశాన్ని ఉద్దేశపూర్వకంగా ఇరికించేందుకు ఆ డ్రోన్లను జనావాసాలపైకి ప్రయోగిస్తున్నాయని తెలిపింది. కాగా, పశ్చిమాసియాలోని ఆయా దేశాలపై ఇరాన్ షాహెద్ డ్రోన్లను భారీగా ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే.