GDWL: మాజీ సర్పంచ్ మృతి.. కీలక విషయాలు
GDWL: కేటీదొడ్డి మండలంలోని నందిన్నె మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు అనుమానాస్పద మృతిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్య వెనుక సూత్రధారిగా భావిస్తున్న నందిన్నె గ్రామంలో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఇది రాజకీయ, వ్యక్తిగత కక్షతో చేశారా అనేది తెలియాల్సి ఉంది. దీని కోసం రాయలసీమ సుపారీ గ్యాంగ్‌ను వినియోగించినట్లు అనుమానిస్తున్నారు.