'పెదవీడులో బ్యాలెట్ 'పంచాయితీ'
SRPT: మఠంపల్లి (M) పెదవీడు గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవికి 18 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో బ్యాలెట్ పేపర్‌పై సర్వత్రా చర్చ సాగుతోంది. నోటాతో కలిపి 19 పేర్లు బ్యాలెట్‌లో ఉండనున్నాయి. బ్యాలెట్ పెద్దదిగా ఉండటంతో ఓటర్లు గుర్తులు గుర్తుపట్టడంలో ఇబ్బంది పడతారనే ఆందోళన అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. దీంతో అధికారులు బ్యాలెట్ మడిచే విధానంపై ఓటర్లకు అవగాహన కల్పిస్తామన్నారు.