మైదుకూరు ఆసుపత్రి ఓపీ సేవలపై ఫిర్యాదు
KDP: మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని రైతు సేవా సమితి పట్టణ అధ్యక్షుడు రామ్మోహన్ కోరారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ జోష్ణ రెడ్డిని గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రిలో సాయంత్రం 4 గంటల వరకు ఓపీ సేవలు అందించాల్సి ఉండగా.. మధ్యాహ్నం ఒంటిగంట వరకే అందిస్తున్నారని ఆరోపించారు.