షీ టీమ్స్, సైబర్ నేరాలపై అవగాహన

SRPT: మఠంపల్లి ఎస్సై బాబు ఆధ్వర్యంలో మాంట్ ఫోర్ట్ పాఠశాలలో విద్యార్థులకు షీ టీమ్స్, డ్రగ్స్,సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. పోలీసులు మాట్లాడుతూ.. విద్యార్థులు సైబర్ మోసాలకు గురికావొద్దని, బ్యాంక్ వివరాలు ఎవరికీ ఇవ్వకూడదని సూచించారు. అలాగే 1930 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదులు చేయాలని విద్యార్థులకు సూచించారు.