VIDEO: పండుగలు మతసామరస్యానికి ప్రతీకలు: ఎమ్మెల్యే
వనపర్తి పట్టణంలోని మక్కా మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే మెగా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగలు మతసామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తాయని హిందూ ముస్లింలు సోదర భావంతో రంజాన్ పండుగను జరుపుకోవడం సంతోషదాయకం అన్నారు. ఉపవాస దీక్ష విరమించిన ముస్లిం సోదరులకు పండ్లు స్వీకరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.