'విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి'
BDK: పాల్వంచ తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో పీవో నిన్న విద్యార్థినులకు క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఐటీడీఏ పీవో బి. రాహుల్ ఆకాంక్షించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి దోహదపడతాయన్నారు. ప్రిన్సిపల్ పి. అనురాధ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు.