పండగలు ప్రశాంతంగా జరుపుకోవాలి: DSP

SRD: పండగలను ప్రశాంతంగా జరుపుకోవాలని సంగారెడ్డి డి.ఎస్.పి సత్తయ్య గౌడ్ అన్నారు. సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో పీస్ కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. వినాయక నవరాత్రి వేడుకలు, మిలాద్ ఉన్ నబీ పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పారు. పోలీసుల సూచనలు ప్రతి ఒక్కరు పాటించాలని పేర్కొన్నారు. సమావేశంలో పట్టణ CI రమేష్ పాల్గొన్నారు.