'సిబిల్ స్కోర్ ఆలోచనను విరమించుకోవాలి'

NLG: సిబిల్ స్కోర్ పరిగణలోకి తీసుకునే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ విజ్ఞప్తి చేశారు. శనివారం నల్గొండలోని దొడ్డి కొమరయ్య భవన్‌లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ.. రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేయడానికి సిబిల్ స్కోర్‌ను పరిగణలోకి తీసుకోవద్దని అన్నారు.