VIDEO: జంగారెడ్డిగూడెం మండలంలో అగ్నిప్రమాదం
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పట్టెన్న పాలెం గ్రామంలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దండ బత్తుల సోంబాబు అనే రైతుకు చెందిన ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇంట్లో ఉన్న సామాన్లతో పాటు పొగాకు బెల్లు కూడా అగ్ని ప్రమాదంలో కాలిపోయినట్లు తెలుస్తుంది. కాగా ప్రమాదానికి గల కారణాలు ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.