పశువుల నీటి తొట్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

అన్నమయ్య: వేసవికాలంలో మూగజీవాలకు పశుగ్రాసంతో పాటు, తాగునీరు అందించి వాటి దాహార్తిని తీర్చే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రైల్వేకోడూరు MLA అరవ శ్రీధర్ అన్నారు. మంగళవారం పెనగలూరు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ యపాటివారి పల్లి, అనంతంపల్లి గ్రామాల్లో కొత్తగా నిర్మించనున్న పశువుల నీటి తొట్లకు శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు.