పోక్సో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

పోక్సో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

పోక్సో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఒక అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పుడు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకుని, ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకున్న వ్యక్తిపై పెట్టిన కేసును రద్దు చేసింది. ఈ చర్య ఇద్దరి మధ్య కామంతో జరగలేదని ప్రేమ వల్ల జరిగిందని అభిప్రాయపడింది. ఆ వ్యక్తి భార్యతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడని వారికి కుమారుడు ఉన్నాడని తెలిపింది.