తహసీల్దార్ కీలక సూచనలు

తహసీల్దార్ కీలక సూచనలు

VZM: బొండపల్లి తహసీల్దార్ రాజేశ్వరరావు కీలక సూచన చేశారు. రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో జాయింట్ ఎల్.పి.ఎం.లుగా నమోదైన ఖాతాల నుంచి ఆ ట్యాగ్‌ను తొలగించుకోవాలని కోరారు. కొండకిండం గ్రామంలో గురువారం రైతులతో సమావేశమై అవగాహన కల్పించారు. గతంలో దీనికి ఉన్న 550 రూపాయల ఫీజులో వన్-టైమ్ మినహాయింపు లభిస్తుందన్నారు.