VIDEO: 'మార్వాడీలు గో బ్యాక్'

MHBD: మహబూబాబాద్ పట్టణంలో శుక్రవారం 'మార్వాడీలు గో బ్యాక్' అంటూ నినాదాలు చేస్తూ సెల్ ఫోన్ దుకాణాలను మూసివేసి, నల్ల బ్యాడ్జీలు ధరించి సెల్ ఫోన్ దుకాణదారులు ర్యాలీ నిర్వహించారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు సుమారు 50 మంది సెల్ ఫోన్ దుకాణదారులను పోలీసులు అదుపులోకి తీసుకుని, తహశీల్దార్ ముందు బైండోవర్ చేశారు.