శ్రీశైలంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

శ్రీశైలంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

NDL: శ్రీశైలంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి సోమవారం భక్తులు భారీగా తరలివచ్చారు. క్షేత్రంలో భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, దర్శనార్థమై క్యూలైన్స్, దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు. దర్శనానికి సుమారు 2 గంటలపైగా సమయం పడుతోందని పేర్కొన్నారు.