వాజేడు ఎస్సై హరీశ్ ఆత్మహత్యకు ఏడాది

వాజేడు ఎస్సై హరీశ్ ఆత్మహత్యకు ఏడాది

ములుగు జిల్లా వాజేడు ఎస్సైగా పనిచేసిన రుద్రారపు హరీశ్ గత ఏడాది డిసెంబర్ 2న ఆత్మహత్య చేసుకున్న ఘటనకు నేటికి ఏడాది పూర్తయింది. ముళ్లకట్ట సమీపంలోని రిసార్టులో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆయన మృతి చెందారు. ప్రేమ వ్యవహారమే మరణానికి కారణమని, ఆ సమయంలో ఓ యువతి ఆయనతో రిసార్టులో ఉన్నట్టు విచారణలో తేలింది. ఈ సంచలన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.