కావలిలో మహిళ ఆత్మహత్య
NLR: కావలిలోని వైకుంఠపురంలో బుధవారం వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం దిలీప్‌కు అనూషతో పదేళ్ల క్రితం వివాహం అయింది. వైకుంటపురంలో నివాసం ఉంటున్నారు. భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అనూష ఇవాళ ఉరి వేసుకుంది. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.