డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరణ

W.G: పెంటపాడు డీఆర్ గోయంకా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సుల్లో ప్రవేశానికి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ టీఎస్ఎన్ ప్రసాద్ తెలిపారు. గురువారం సాయంత్రం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులు అర్హులుగా పేర్కొన్నారు. విద్యార్థుల సహాయార్థం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.