ఓఆర్ఆర్ ఎగ్జిట్ టోల్‌గేట్ మూసివేత

RR: గణేష్ నిమజ్జన ఊరేగింపుల నేపథ్యంలో హిమాయత్ సాగర్ వద్ద ఓఆర్ఆర్ ఎగ్జిట్-17 టోల్‌గేట్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ తెలిపారు. 7వ రోజు, 9వ రోజు పెద్దఎత్తున గణనాథులు పత్తికుంటకు తరలివస్తాయని, ఆ రోజు ఊరేగింపుతో పాటు వాహనాలకు ఇబ్బంది కలగకుండా ఎగ్జిట్.16 మీదుగా దారి మళ్లిస్తున్నామన్నారు.