తీగలేరు ఉధృతికి నిలిచిపోయిన రాకపోకలు

ప్రకాశం: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం జిల్లా జలమయమైంది. పలుచోట్ల వాగులు, వంకలు పెద్దఎత్తున పొంగిపొర్లుతున్నాయి. వాహనాలు రాకపోకలు నిలిచి జనజీవనం స్తంభించిపోయింది. దోర్నాల మండలం చిన్న దోర్నాల వద్ద తీగలేరు వాగు ఉప్పొంగడంతో మార్కాపురం నుంచి దోర్నాల, శ్రీశైలం వెళ్లే మార్గంలో వరద నీరు చేరి ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.