VIDEO: ఏడుపాయలు అమ్మవారికి ఏకాదశి ప్రత్యేక పూజలు

MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయలలో వన దుర్గమ్మకు గురువారం సర్వ ఏకాదశి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైశాఖమాసం, శుక్లపక్షం, బృహస్పతి వాసరే తిథిని పురస్కరించుకొని అమ్మవారికి విశేష అలంకరణలో సహస్రనామాలతో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు.