VIDEO: తీవ్ర మంచు.. ప్రజలకు ఇబ్బందులు
AKP: రోలుగుంట ప్రాంతం సోమవారం ఉదయం గట్టి మంచుతో మసకబారింది. దట్టమైన పొగమంచు కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ప్రజలు బయటకే రావడం కష్టంగా మారింది. స్పష్టత లేక వాహనదారులు లైట్లు ఆన్ చేసుకుని నెమ్మదిగా ప్రయాణిస్తున్నారు. ఇటీవలి భారీ వర్షాల ప్రభావంగానే ఈ అసాధారణ చలి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. సాధారణంగా చేసే ఉదయపు నడకలు కూడా నిలిచిపోయాయి.